Kadiri: చలో ఢిల్లీని జయప్రదం చేయాలి.. బీడీ కార్మికులకు సీఐటీయూ పిలుపు
Kadiri: డిసెంబర్ 1, 2, 3న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని కదిరి నిజాంవళి కాలనీలో సీఐటీయూ ప్రచారం; లేబర్ కోడ్ల రద్దు, బీడీ కార్మికుల సంక్షేమ చట్టంపై డిమాండ్.
Kadiri: చలో ఢిల్లీని జయప్రదం చేయాలి.. బీడీ కార్మికులకు సీఐటీయూ పిలుపు
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని బీడీ నివాస ప్రాంతాల్లో (నిజాంవళి కాలనీ) చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబానీ అదాని, రిలయన్స్ పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చింది.
వీటిని రద్దు చేయాలని బీడీ కార్మికులకు సంక్షేమ చట్టం పునరుద్ధరించాలని,కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ 2026 డిసెంబర్ 1,2,3 తారీకులలో ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమంలో బీడీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్ర రాష్ట్రంలో వేలాది మంది బీడీ తయారీలో పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం అమలు కాకపోవడం, ప్రతి 1,000 బీడీలు చుట్టేందుకు రు 200 నుంచి రు. 250 తక్కువ వేతనాలతో, నిత్యావసర సరుకుల అధిక ధరలతో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు.
వీరు నిరంతరం పొగాకు ఉత్పత్తుల్లో పాల్గొంటున్నందువలన ఎన్నో జబ్బులకు గురవుతున్నారు. వీరికి ఎంతో రక్షణగా ఉన్నటువంటి సంక్షేమ చట్టం రద్దు కావడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి గతం నుంచి అమలవుతున్న వైద్య సౌకర్యం నిర్వీర్య మైంది, రాష్ట్రంలో నెల్లూరు, రాయచోటి ,కమలాపురం, కడప తాడపత్రి ప్రాంతాలలో ఉ న్న మెడికల్ క్లినిక్కులలో మెడికల్ ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేరు, మందులు లేవు మూల బడిన పరిస్థితి నెలకొన్నది.
బీడీ కార్మిక సంక్షేమ చట్టం పునరుద్ధరించే అంతవరకు పొగాకు ఉత్పత్తుల పై వసూలు చేస్తున్న జీఎస్టీ నుంచి బీడీ కార్మికుల సంక్షేమ కొరకు స్కాలర్ షిప్పులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలని బీడీ కార్మిక సంఘం కోరుతోందన్నారు.
బీడీ కార్మికులకు సంక్షేమ చట్టం పునరుద్ధరించాలని కనీస వేతనం అమలు, లేబర్ కోడులు రద్దు కై డిసెంబర్ 1,2,3 తేదీల్లో ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమంలో బీడీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బాబ్ జాన్, నాయకులు ముస్తాక్, రామ్మోహన్, రమేష్, మహబూబ్ బాషా, నారాయణ, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.




