Kadiri: కదిరిలో వైభవంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ఘనంగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తుల పెద్దఎత్తున తరలిక.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 Nov 2026 12:28 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో వైభవంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్దయెత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.

తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ దేవదేవుడిని మనస్సున ఒక్కసారి స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.శ్రీ వారు ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసారని కదిరి కొండపై కాటమరాయుడుగా పాదం మోపిన ప్రదేశం కావడం అందులోనూ నవ నారసింహ క్షేత్రాల్లో ప్రాముఖ్యత కలిగిన కారణంగా మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి శ్రీ వారి దర్శనం కోసం వచ్చిన అనంతరం శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు.

శ్రీ వారి ఆలయ అర్చకులు కదిరి కొండకు ( స్తోతాద్రి ) ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.శ్రీ వారి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రసాదం , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ స్వామి సేవా సమితి సభ్యులు మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు.ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వాకర్స్ అసోసియేషన్ అండ్ ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మహా ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ఉప కమిషనర్ & E.O. శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ స్పందించి గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని రావాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు , హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు , శ్రీ వారి భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI