Kadiri: కదిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్లు ప్రశాంతంగా సాగుతున్నాయి.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 Oct 2026 12:45 PM IST
Kadiri
X

Kadiri: కదిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ!

Kadiri: కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో కూడా ఎంపీటీసీ నామినేషన్లు సజావుగా సాగుతుంది.తలుపుల మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు.

ఏ పార్టీకి చెందిన అభ్యర్థులకైనా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురైతే ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అవసరమైన భద్రత కల్పించి, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శివ నారాయణస్వామి హెచ్చరించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI