Kadiri: భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్త

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అర్ధరాత్రి దారుణం జరిగింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 July 2026 8:52 AM IST
Kadiri
X

Kadiri: భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్త

Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భార్య సునీతమ్మ అర్ధరాత్రి మూడు గంటల సమయంలో భర్త గంగరాజు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. ముదిగుబ్బ మండలం మద్దన్నవారిపల్లెకి చెందిన సునీతతో అదే మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజుతో పది సంవత్సరాలు క్రితం వివాహమైంది.

బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగరాజు భార్యపై అనుమానంతో మద్దన్నవారిపల్లికి కొచ్చారు. భార్యాభర్తల మధ్య ఘర్షణతో భార్య సునీతకు స్వల్ప గాయాలయ్యాయి కాగా చికిత్స కోసం సునితను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ తరలించారు హాస్పిటల్ లో భార్యకు మాయమాటలు చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్దామని హాస్పిటల్ లో నుంచి బయటికి తీసుకువచ్చి ఆవరణంలోనే కత్తితో దారుణంగా చంపేశాడు.

ఇదిలా ఉండగా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మంగళవారం రాత్రి భర్త గంగరాజు భార్య కుటుంబ సభ్యులు మధ్య వివాదం చోటు చేసుకుంది అవుట్ పోస్ట్ పోలీసులు భర్త గంగరాజును అక్కడి నుంచి పంపించేయగా మళ్లీ రాత్రి మూడు గంటల సమయంలో వచ్చి భార్యను హత్య చేశారు. హాస్పిటల్ లో హత్య జరగడంతో రోగులు డాక్టర్లు సిబ్బంది ఉల్లిక్కిపడ్డారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story