Kadiri: ప్రభుత్వ ఖాజీపై అధికారులకు ఫిర్యాదు చేస్తాం: నిసార్ యాసిన్!

Kadiri: కదిరి ప్రభుత్వ ఖాజీపై సర్టిఫికెట్ల జారీ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని నిసార్ యాసిన్ తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 22 Oct 2026 8:51 PM IST
Kadiri
X

Kadiri: ప్రభుత్వ ఖాజీపై అధికారులకు ఫిర్యాదు చేస్తాం: నిసార్ యాసిన్!

కదిరి: సత్య సాయి జిల్లా కదిరి తాలూకా ప్రభుత్వ ఖాజీ సయ్యద్ అబ్దుల్ మన్నన్‌కు సంబంధించి సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసిన్ డిమాండ్ చేశారు.

గురువారం కదిరి పట్టణంలోని NGO హోమ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

కుల, మత, వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం పేద ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తిని పదవి నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేద మైనారిటీలకు న్యాయం జరిగేలా, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని నిసార్ యాసిన్ కోరారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI