Kadiri: డెంగ్యూపై కదిరి వైద్య సిబ్బంది అవగాహన

Kadiri: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 16 May 2026 4:37 PM IST
Kadiri
X

Kadiri: డెంగ్యూపై కదిరి వైద్య సిబ్బంది అవగాహన

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన కుటాగుళ్ల, నిజాంవళి కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, మూర్తి పల్లి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ANM లు ఆశా లు MPHA (M). మరియు సబ్ యూనిట్ సిబ్బంది కలిసి మూర్తి పల్లి పరిధిలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కదిరి పడమర సబ్ యూనిట్ అధికారి శ్రీ దేవళా నాయక్ సార్ గారు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మంచినీటిలో పెరిగే దోమలే డెంగ్యూ వ్యాధిని కలిగిస్తాయని, అందువల్ల ఇంటిలో ఉన్న మంచినీటి కుండలపైన, డ్రమ్ములపైన మూతలు ఉంచాలని, కచ్చితంగా అందరూ దోమతెరలు వాడాలని, సాయంకాల సమయంలో వేపాకు పొగ వేసుకోవాలని, అలాగే చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో MPHS(M) శశి సార్, మరియు MPHA (M) కరుణాకర రెడ్డి, నరేందర్ రెడ్డి, రవికుమార్, ప్రతాప్ రెడ్డి, మస్తాన్ వలి, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, C. O. వనజ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మానవహారం ఏర్పరచి ప్రజలకు అవగాహన కలిగించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story