Kadiri: కదిరి నరసింహస్వామి ఆలయంలో జనసేన ప్రత్యేక పూజలు!

Kadiri: శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీసత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 July 2026 9:35 PM IST
Kadiri
X

Kadiri: కదిరి నరసింహస్వామి ఆలయంలో జనసేన ప్రత్యేక పూజలు!

కదిరి: ఈరోజు సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి యందు జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి రావాలని, ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ స్వామి వారికి అర్చన మరియు పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బ్లూమూన్ శివశంకర్,టీవీ రమణ,చిన్నపరెడ్డి, అంజి బాబు, కాకర్ల రామచంద్ర, హరిబాబు,ఇర్ఫాన్,రామ్మోహన్,రాజేంద్రప్రసాద్,చక్రవర్ధన్, రఘు,మేకల చెరువు రామచంద్ర, గంగరాజు, నాగరాజు, రాజశేఖర్, పీరానాయక్ తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story