Kadiri: కదిరిలో వీఆర్ఏల దీక్షకు సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు!
Kadiri: కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల దీక్షకు సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్.
Kadiri: కదిరిలో వీఆర్ఏల దీక్షకు సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ ల దీక్షకు సంపూర్ణ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి ఇలియాకత్ అలీ సంపూర్ణంగా మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు, రెవెన్యూ శాఖకు కీలకంగా సేవలందిస్తున్న వీఆర్ఏలు, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏలు, ప్రధానంగా కోరుతున్న జీతం స్కేలు అమలు, అర్హత ఉన్న వారికి పదోన్నతులు (ప్రమోషన్లు), ఉద్యోగ భద్రత, సర్వీస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం, జాయింట్ యాక్షన్ కమిటీతో ప్రభుత్వం చర్చలు జరపడం, ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కల్పించడం వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, సాధ్యమైన డిమాండ్లను కాలపరిమితితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏలు చేపడుతున్న ఈ దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సంపూర్ణ సంఘీభావం, మద్దతు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఆదినారాయణ ప్రజానాట్యమండలి భాస్కర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తిప్పన్న అంజినప్ప. పాల్గొన్నారు




