Kadiri: ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నా కృషి కొనసాగుతుంది!
Kadiri: కదిరి పట్టణం 6వ వార్డు న్యూ అమీన్ నగర్, కందికుంట నారాయణమ్మ కాలనీల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 'ప్రజా దర్బార్' జరిగింది.
Kadiri: ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నా కృషి కొనసాగుతుంది!
కదిరి: ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 6వ వార్డు న్యూ అమీన్ నగర్, కందికుంట నారాయణమ్మ కాలనీ కి సంబంధించిన 'ప్రజా దర్బార్' నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను.
హౌసింగ్ ,పెన్షన్లకు,రామాలయం గుడి,న్యూ అమీన్ నగర్ కాలనీ నందు కరెంట్ లో ఓల్టేజ్ సంబంధించిన పలు సమస్యలు దృష్టికి రావడం జరిగింది.
ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది.
దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను.
ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లడమే లక్ష్యంగా, ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు నా కృషి కొనసాగుతుందనీ ఎమ్మెల్యే తెలిపారు.




