Kadiri: తాపసిహళ్లి ఆశ్రమంలో గురువందనం.. హాజరైన కదిరి ఎమ్మెల్యే!

Kadiri: తాపసిహళ్లి ఆశ్రమంలో గురువందన మహోత్సవం. స్వామివారి ఆశీస్సులు పొంది, ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.Kadiri MLA Kandikunta Attends Guru Vandana at Thapasihalli

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 Aug 2026 5:22 PM IST
Kadiri
X

Kadiri: తాపసిహళ్లి ఆశ్రమంలో గురువందనం.. హాజరైన కదిరి ఎమ్మెల్యే!

గురువుల ఆశీస్సులు – విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం: తాపసిహళ్లి గురువందన కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం సమీపంలోని తాపసిహళ్లిలో వెలసిన శ్రీ పుష్పాండజ మహర్షి ఆశ్రమంలో, తొగటవీర క్షత్రియ కులగురువులు పూజ్యశ్రీ దివ్యజ్ఞానానంద గిరి స్వామివారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన గురువందన మహోత్సవ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్వామివారు, ఆశ్రమ ప్రతినిధులు, కుల పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు అందుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు (సర్టిఫికెట్లు), నగదు ప్రోత్సాహకాలు మరియు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులను అభినందిస్తూ వారి ఉన్నత విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గురువు మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కృషి కలిసివస్తేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాణ శిల్పులని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ పురోగతికి ఎంతో అవసరమని, ఇటువంటి గురువందన కార్యక్రమాలు భారతీయ సంస్కృతి, గురు-శిష్య పరంపర గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయని పేర్కొన్నారు.

అనంతరం పూజ్యశ్రీ దివ్యజ్ఞానానంద గిరి స్వామివారిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, తొగటవీర క్షత్రియ సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story