Kadiri: కుమ్మరవాండ్లపల్లిలో ఎమ్మెల్యే కందికుంట విస్తృత ప్రచారం
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి భార్గవ్, వార్డు అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే కందికుంట ప్రచారం.
Kadiri: కుమ్మరవాండ్లపల్లిలో ఎమ్మెల్యే కందికుంట విస్తృత ప్రచారం
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి మేజర్ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్. పార్థసారథి విస్తృతంగా పాల్గొన్నారు.
ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకుంటూ కూటమి సర్పంచ్ అభ్యర్థి భార్గవ్ గారికి, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి భార్గవ్ ని మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




