Kadiri: దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట

Kadiri: కదిరిలో 10 మంది దివ్యాంగులకు రూ.15 లక్షల విలువైన మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట. వైసీపీ విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 July 2026 4:57 PM IST
Kadiri
X

Kadiri: దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి: 10 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. కదిరి ఆర్ అండ్ బి వసతి గృహంలో సుమారు రూ.15 లక్షల విలువైన రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను 10 మంది దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పా వైసీపీ నాయకులకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఏపీ విద్యాశాఖలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి లాగా ఏపీలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story