Kadiri: చౌడేశ్వరి దేవి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటప్రసాద్

Kadiri: కదిరి మదనపల్లి రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో విజయదశమి పూజలు, రథయాత్రలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 20 Oct 2026 6:32 PM IST
Kadiri
X

Kadiri: చౌడేశ్వరి దేవి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటప్రసాద్

Kadiri: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం దసరా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి రథయాత్రలో పాల్గొన్నారు.

అమ్మవారి కృపతో కదిరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI