Sri Sathya Sai: కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన ఎమ్మెల్యే

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం నూతనకాలువ గ్రామంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 16 May 2026 9:03 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి జిల్లా: తలుపుల మండలం నూతనకాలువ గ్రామంలో చక్రపాణి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆ గ్రామానికి చేరుకొని కార్యకర్తకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్త పాడె మోసి అంత్యక్రియలు చివరి వరకు ఉండి మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం చూస్తే ఆయనకు కార్యకర్తలపై ఉన్న అభిమానం మమకారం ఇట్టే తెలుస్తోంది. ఈ సంఘటన చూసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త హృదయాలను తాకిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story