Kadiri: కదిరిలో రూ.18.55 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!

Kadiri: కదిరిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. గత రెండేళ్లలో నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి.

P.RAHAMTULLA, KADIRI
Published on: 26 Jun 2026 3:53 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో రూ.18.55 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గత రెండేళ్లలో కదిరి నియోజకవర్గానికి దాదాపు రూ.5 కోట్ల 8 లక్షల 38 వేల సీఎం సహాయనిధి మంజూరైనట్లు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి వసతిగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.18 లక్షల 55 వేల విలువైన చెక్కులను అందజేశారు. గత రెండేళ్ల కాలంలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 594 మంది లబ్ధిదారులకు రూ. 5 కోట్ల 8లక్షల 38 వేలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

తన స్థాయి గురించి కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు చవాకులు వెళ్తున్నారని,వీల్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డి చట్టసభలకు రాక ముందు నుంచే తాను చట్టసభలు చూసిన స్థాయి తనదంటూ కౌంటర్ సమాధానమిచ్చారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story