Kadiri: కదిరి మున్సిపల్ టీడీపీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల రేసులో ఉన్న 44 మంది టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీ-ఫామ్‌లు అందజేశారు.
Kadiri: కదిరి మున్సిపల్ టీడీపీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరుపున నామినేషన్ వేసిన 44 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వారికి బీఫామ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఫామ్ తీసుకున్న అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం గురించి దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఒక్కరి గెలుపు కోసం అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులంతా ప్రతి ఇంటికి గడపగడపకూ వెళ్లి ఓటర్లకు పావనం చేసుకొని ఓట్లు వేయించాలని తెలిపారు.అలాగే ప్రతి అభ్యర్థి మీ గెలుపు కోసం ఓట్లు అడుగుతూ చైర్మన్ అభ్యర్థి కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.




