Kadiri: కదిరిలో 34 మందికి రూ.46 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 34 మంది లబ్ధిదారులకు రూ.46.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 16 Sept 2026 5:02 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో 34 మందికి రూ.46 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పేద కుటుంబాల్లో అనారోగ్యం కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పేదల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 34 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.46,01,038 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు పెద్ద ఆర్థిక భారంగా మారుతున్నాయని, అలాంటి కుటుంబాలకు CMRF ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు.

“పేదల ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయనిధి వంటి సహాయాలను అందేలా నా వంతు కృషి చేస్తానన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.

కదిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 688 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.5,95,46,823 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే, సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కదిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

CMRF ద్వారా ఆర్థిక సహాయం అందడంతో తమ కుటుంబాలకు ఎంతో ఊరట లభించిందని లబ్ధిదారులు పేర్కొంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI