Kadiri: బలిజ సంఘం కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ ఎమ్మెల్యే కందికుంట

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీటీడీ కోనేరు పక్కన బలిజ సంఘం కళ్యాణ మండప నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శంకుస్థాపన చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 12 July 2026 9:49 PM IST
Kadiri
X

Kadiri: బలిజ సంఘం కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ ఎమ్మెల్యే కందికుంట

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం కోనేరు (బృగతీర్థం) ప్రక్కన నిర్మించనున్న బలిజ సంఘం కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, బలిజ సంఘం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ్యాణ మండపం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

సమాజానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బలిజ సంఘం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story