Kadiri: కదిరి మున్సిపల్ పాలకవర్గ ప్రమాణం.. రూ.1.47 కోట్ల పనులకు శ్రీకారం
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్గా షేక్ అర్షియా బాను, వైస్ చైర్మన్గా సాతర్ల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం; తొలి సంతకంతో రూ.1.47 కోట్ల పనులు.
Kadiri: కదిరి మున్సిపల్ పాలకవర్గ ప్రమాణం.. రూ.1.47 కోట్ల పనులకు శ్రీకారం
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ ఛైర్మన్ 44 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ అర్షియా బాను తోపాటు వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న సాతర్ల విజయ్ కుమార్ తో కదిరి RDO ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహారించాలని సభ్యులందరికి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మొదటి సంతకంతో కోటి 47 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు చైర్మన్ అర్షియా బాను శ్రీకారం చుట్టారు.




