Kadiri: కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ 41వ వార్డు మూర్తిపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పరిశీలకులు చెంచయ్య నాయుడు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 25 Oct 2026 10:34 PM IST
Kadiri
X

Kadiri: కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే!

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 41వ వార్డు మూర్తిపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కదిరి నియోజకవర్గ పరిశీలకులు చెంచయ్య నాయుడు కలిసి వార్డులో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కదిరి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

నవంబర్ 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకు వేసి, వేయించి చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారితో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలను కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మూర్తిపల్లి వార్డులో అడుగడుగునా ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ, హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల నుంచి లభించిన ఆదరణ పట్ల ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు.

కదిరి పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI