Kadiri: కదిరి మున్సిపల్ చైర్పర్సన్ బరిలో ముగ్గురు అభ్యర్థులు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి టీడీపీ తరఫున షేక్ సమీరా, వైసీపీ నుంచి అత్తార్ పర్వీన్, కాంగ్రెస్ నుంచి మఠం రామశ్రీ లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.
Kadiri: కదిరి మున్సిపల్ చైర్పర్సన్ బరిలో ముగ్గురు అభ్యర్థులు
కదిరి: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ తరుపున షేక్ సమీరా నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థి భర్త కదిరి పట్టణ అద్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్ సీపీ తరుపున చైర్ పర్సన్ అభ్యర్థిగా అత్తార్ పర్వీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ తో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిలమత్తూరు మోహన్ గాంధీ సతీమణి మఠం రామశ్రీ లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.ఆమె వెంట కదిరి దేవస్థానం మాజీ ఛైర్మన్ శ్రీహరి ప్రసాద్, మాజీ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పీఎస్ అహ్మద్ హుస్సేన్, రాష్ట్ర బీసీ మాజీ ఉపాద్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్ వెళ్లి ఆమె అభ్యర్థి త్వానికి బలపరచారు.
నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.




