Kadiri: బీడీ కార్మికుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

Kadiri: కదిరిలో బీడీ కార్మికుని కుటుంబంలో వివాహం సందర్భంగా సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్ ఖాన్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 3 Oct 2026 9:03 PM IST
Kadiri
X

Kadiri: బీడీ కార్మికుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

కదిరి: సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ముందు బీడీ వర్కర్ NYPSN కార్డు పొందిన వ్యక్తి కుటుంబంలో వివాహం జరగనున్న సందర్భంగా, ఆ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించి మానవతా సేవను చాటుకున్నారు కదిరి సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్ ఖాన్

బీడీ కార్మికుని కుటుంబంలో వివాహం జరుగుతున్న విషయం తెలుసుకున్న నిసార్ యాసీన్ ఖాన్ స్వయంగా వారి ఇంటి వద్దకు వెళ్లి వివాహ ఖర్చుల నిమిత్తం రూ.10,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారికి, పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నిసార్ యాసీన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం, అవసరమైన సమయంలో సహాయం అందించడం తన సేవా కార్యక్రమాల్లో భాగమని ఆయన పేర్కొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI