Sri Satya Sai: కొలంబోలో కదిరి క్రీడాకారిణి శైలజ ‘గోల్డ్’ మెరుపులు!

Sri Satya Sai: శ్రీలంకలో జరిగిన దక్షిణ ఆసియా గోల్ షాట్ బాల్ పోటీల్లో కదిరి క్రీడాకారిణి శైలజ అద్భుత ప్రతిభ కనబరిచి భారత జట్టును విజేతగా నిలిపారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 30 April 2026 9:19 PM IST
Sri Satya Sai
X

Sri Satya Sai: కొలంబోలో కదిరి క్రీడాకారిణి శైలజ ‘గోల్డ్’ మెరుపులు!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి: శ్రీలంక దేశంలోని కొలంబోలో ఈనెల 24 నుండి 28వ తేదీ వరకు జరిగిన దక్షిణ ఆసియా గోల్ షాట్ బాల్ పోటీల్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. భారత జట్టు తరుపున కదిరి క్రీడాకారిణి శైలజ పాల్గొని క్రీడలో మంచి ప్రతిభ కనబరిచింది. విజయం సాధించి తిరిగి స్వగ్రామానికి విచ్చేసిన శైలజకు ఈ రోజు కదిరి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి ప్రాంతానికి చెందిన శైలజ గోల్ షాట్ బాల్ భారత జట్టుకు ఎంపికై, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయం సాధించడం గర్వకారణమన్నారు. ఫైనల్ మ్యాచ్ లో భారత్, శ్రీలంక జట్లు తలపడగా శైలజ నాలుగు గోల్స్ చేసి విజయాన్ని సునాయాసం చేసిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో శైలజ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శైలజకు అభినందనలు తెలియజేసి మెడల్ తో సత్కరించారు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story