Kadiri: కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ.. వైసీపీపై కందికుంట వెంకటప్రసాద్ ఫైర్!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు.
Kadiri: కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ.. వైసీపీపై కందికుంట వెంకటప్రసాద్ ఫైర్!
కదిరి: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ 15వ శతాబ్దంలో సామాన్యుల ఆలోచనలను అర్థం చేసుకున్న గొప్ప మనసున్న మహారాజు శ్రీకృష్ణదేవరాయులని కొనియాడారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు హంద్రీనీవా కాలువలు త్రవించారని తెలిపారు. అంతే స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణ జలాలతో చెరువులకు నీళ్లు అందించారన్నారు.
కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టుకుంటామంటే అప్పటి వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ఎక్కడైతే అవమానాలు గురయ్యారో అక్కడే తలెత్తుకొని సగర్వంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గత వైసిపి అరాచక ప్రభుత్వాన్ని పాతాలోకంలోకి తొక్కేసిన వారిలో మార్పు రాలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. నిర్మాత్మకమైన రాజకీయాలు చేయడంలో వైసిపి విఫలమైందన్నారు. డబ్బులు ఉంటేనో కులం ఉంటేనో రాజకీయ నాయకులు కాలేరని ప్రజల కష్ట,నష్టాలు పట్ల అవగాహన ఉంటేనే చిరకాలం నాయకుడుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనతో వైసీపీ రాజకీయాలు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అంటగడుతూ పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారని జగన్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నది కూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బలిజ సంగం వారికీ కేటాయించిన కల్యాణ మంటపం పనులు తొందర్లోనే మొదలు పెట్టి మూడు నెలలు వ్యవదిలోనే పూర్తి చేసి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిదంగా వడ్డెర కులస్తులు కి ఇచ్చిన కల్యాణ మంటపం కూడా పనులు పూర్తిగా చేయించి ఇస్తామన్నారు. శ్రీ మత్ ఖాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి కోనేరు పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని యువత, మహిళలు అందరు కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొనే స్తోదాద్రి గిరి ప్రదక్షిణ కి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఆలయంలోకి వర్షం నీరు రాకుండా 15 రోజులలో పరిష్కారం చూపుతామని ఈ కార్యక్రమం ముఖంగా తెలిపారు.




