Kadiri: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు!

Kadiri: కదిరిలో ఐటీఐ విద్యార్థి యశ్వంత్ (15) అదృశ్యం: కాలేజీకి వెళ్లిన బాలుడు ఇంటికి రాలేదు.. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు, ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 Sept 2026 11:11 PM IST
Kadiri
X

Kadiri: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు!

కదిరి: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరుకులవాండ్లపల్లె గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు యశ్వంత్, వయస్సు సుమారు 15 సంవత్సరాలు, కదిరి రిపబ్లిక్ ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

తేదీ 26.09.2026 ఉదయం సుమారు 09:00 గంటలకు ఐటీఐకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో, అతని తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

యశ్వంత్ ఆచూకీ తెలిసిన వారు లేదా అతనిని ఎక్కడైనా గుర్తించిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరుతున్నట్లు కదిరి అప్గ్రేడ్ పోలీసులు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI