Kadiri: కదిరి రూరల్‌లో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రచారం జోరు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కాళసముద్రంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి మహేష్ బాబు ముమ్మర ప్రచారం నిర్వహించారు.
Kadiri: కదిరి రూరల్‌లో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రచారం జోరు
సత్యసాయి జిల్లా: కదిరి రూరల్ మండలంలో కూటమి ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరి రూరల్ మండలం కాళసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, స్థానిక MPTC అభ్యర్థి చిల్లా మహేష్ బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. గ్రామీణాభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ హరికృష్ణ, సీనియర్ నాయకులు చెన్నకేశవులు, నర్సిరెడ్డి బూత్ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




