Kadiri: గాండ్లపెంట వద్ద బోల్తా పడిన సాధన స్కూల్ బస్సు.. తప్పిన ప్రమాదం
Kadiri: వీరమల్లయ్యగారిపల్లి మలుపు వద్ద బోల్తా పడిన కదిరి సాధన స్కూల్ బస్సు. 11 మంది విద్యార్థులు సురక్షితం. ఫిట్‌నెస్ లేని బస్సులపై ఆర్‌టీఏ హెచ్చరిక.
Kadiri: గాండ్లపెంట వద్ద బోల్తా పడిన సాధన స్కూల్ బస్సు.. తప్పిన ప్రమాదం
కదిరి: పట్టణంలోని సాధన పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు గాండ్లపెంట మండలం వీరమల్లయ్యగారిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది.
విద్యార్థులను తీసుకువెళ్లే సమయంలో వీరమల్లయ్యగారి పల్లె మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. బస్సులో విద్యార్థులు 11 మంది ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
స్కూల్ బస్సు వీరయ్యగారిపల్లి వద్ద బోల్తా పడడంతో భయంతో తల్లిదండ్రులు బస్సు వద్దకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు కాకపోవడం, సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మోటారు వాహన తనిఖీ అధికారి వరప్రసాద్, కండిషన్ లేని, నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని RTA అధికారి స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరించారు.
Next Story




