Kadiri: కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు

Kadiri: కదిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ‘వెన్నుపోటు దినోత్సవం’ ఆందోళనలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 4 Jun 2026 2:38 PM IST
Kadiri
X

Kadiri: కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు

కదిరి: నియోజకవర్గంలో పలుచోట్ల వెన్నుపోటు దినోత్సవాన్ని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిర్వహించారు. నల్లచెరువులో మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం చేపట్టారు కార్యక్రమంలో సమన్వయకర్త బిఎస్ మక్బుల్ పాల్గొన్నారు. నల్లచెరువులో ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ కూడలిలో మేనిఫెస్టోను దహనం చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడంలో పూర్తిగా విఫలమైందని సమన్వయకర్త మక్బుల్ మండిపడ్డారు. పిల్లనిచ్చిన సొంత మామకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్న చంద్రబాబుకు ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడడం కొత్తమీ కాదని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూటమి పాలనకు చరమగీతం పాడాలని వైఎస్ఆర్సిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story