Rayadurgam: నాపై అక్రమంగా 22 కేసులు పెట్టారు.. కాలవ శ్రీనివాసులు
Rayadurgam: వైసీపీ ఐదేళ్ల పాలనలో తనపై అక్రమంగా 22 కేసులు బనాయించారని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
Rayadurgam: నాపై అక్రమంగా 22 కేసులు పెట్టారు.. కాలవ శ్రీనివాసులు
Rayadurgam: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో ప్రతి అడుగు నిర్బంధించిన వేధింపులకు గురిచేసిన ధైర్యంగా ఎదుర్కొని పోరాడమని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాలవ శ్రీనివాసులతోపాటు టిడిపి నాయకులు 22 మందిపై నమోదైన కేసు విచారణలో భాగంగా రాయదుర్గం జూనియర్ సివిల్ కోర్టుకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
2020 మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయంగా టిడిపి పార్టీ ఇద్దరు కౌన్సిల్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై కారణాలను తెలుసుకునేందుకు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్ళగా పోలీసులు అక్రమంగా అడ్డుకున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఆరోజు ఫోన్ ద్వారా జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
సహేతుకమైన కారణాలు తెలియజేయాలని ఆయన మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించడంతో స్వయంగా మున్సిపల్ కమిషనర్ వచ్చి ఆయనతోపాటు తమను తీసుకెళ్లినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో కూర్చున్న సమయంలో వైసీపీ పార్టీ కు చెందిన ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి చేరు కుర్చీతో తనపై దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.
అదేవిధంగా దాదాపు 80 నుంచి 100 మంది తనపై దాడి చేసేందుకు కుట్రపన్నారని పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నించిన దృశ్యాలన్నీ వీడియో ఆధారాలతో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించినట్లు బలవంతంగా ఆయన నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయించి తనతో పాటు 25 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసు బనగాంచినట్లు తెలిపారు.
తనను నేరస్థుడుగా చిత్రీకరించేందుకు అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తనపై 22 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.అధికారం ఉందని విర్రవీగితే పతనం తప్పదని ఇందుకు జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం కావడమే నిదర్శనమని పేర్కొన్నారు.




