Kalyandurg: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన మెగా బైక్ ర్యాలీ!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన మెగా బైక్ ర్యాలీ, కేక్ కటింగ్.
Kalyandurg: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన మెగా బైక్ ర్యాలీ!
Kalyandurg: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు,యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో కళ్యాణదుర్గానికి తరలివచ్చారు.
జనసేన నాయకుడు బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా బైక్ ర్యాలీలో నియోజకవర్గానికి చెందిన జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలతో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ యువజన విభాగం ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో జనసేన నాయకులు,జనసైనికులు,యువత కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా యువజన విభాగానికి సంబంధించిన లోగో,సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల్లో యువతను మరింత భాగస్వాములను చేసేందుకు యువజన విభాగం ఏర్పాటు దోహదపడుతుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు,వీర మహిళలు,జనసైనికులు,యువకులు, అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. మెగా బైక్ ర్యాలీ,జన్మదిన వేడుకలు, యువజన విభాగం కార్యక్రమంతో కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన శ్రేణుల సందడి నెలకొంది.




