Kalyandurg: ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాం - ఎమ్మెల్యే!

Kalyandurg: కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం. ప్రతి ఇంటికీ కుళాయి, సీసీ రోడ్ల ఏర్పాటుకు హామీ ఇచ్చి ఓట్ల విజ్ఞప్తి.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 24 Oct 2026 11:12 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాం - ఎమ్మెల్యే!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదుకల్లు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆయన, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

వచ్చే ఏడాదిలోగా ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి నిత్యం తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయడంతో పాటు రేషన్ బియ్యం కోసం స్థానికంగానే రేషన్ షాపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

మున్సిపాలిటీలో వైసీపీ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఉండటంతో అభివృద్ధి పనులకు సహకారం అందలేదని ఎమ్మెల్యే అమిలినేని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కాలనీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కాలనీవాసుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam