Kalyandurg: బడికి రండి.. సైకిల్ పట్టుకెళ్ళండి! కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

Kalyandurg: కళ్యాణదుర్గంలో ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు.

P.Sudhakar, Anantapuram
Published on: 13 May 2026 1:00 PM IST
Kalyandurg
X

Kalyandurg: బడికి రండి.. సైకిల్ పట్టుకెళ్ళండి! కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. పట్టణంలోని 7వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ బడులుఅభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ద్వారా యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, సాక్స్ వంటి అవసరమైన వస్తువులు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు.బడిపిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా నేడు 20 మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందినట్లు వెల్లడించారు.

విద్యార్థులు చదువుకు దూరం కాకుండా అధికారులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలోని 9, 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే మూడు నెలల్లో ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్ బాబు, సర్వ శిక్షా అభియాన్ పీడీ శైలజ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story