Kalyandurg: ఒంటిమిద్దిలో అమిలినేని విద్యాచక్రం.. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

Kalyandurg: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒంటిమిద్ది జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 5 Sept 2026 3:44 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఒంటిమిద్దిలో అమిలినేని విద్యాచక్రం.. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమిలినేని విద్యాచక్రం కార్యక్రమాన్ని నిర్వహించి 9, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. దూర ప్రాంతాల నుంచి కొంతమంది విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలకు వస్తున్న పరిస్థితిని గమనించి.. వారి ప్రయాణ ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో సైకిళ్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని అమిలినేని సురేంద్రబాబు సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఎమ్మెల్యే నివాళులర్పించారు.

పాఠశాలలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు విద్యను అభ్యసించే పవిత్రమైన ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించడంతో వారి ప్రయాణ కష్టాలు తగ్గుతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పట్ల వారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam

Next Story