Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తొలి రౌండ్‌లో కూటమి ఘనవిజయం!

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తొలి రౌండ్ ఫలితాలు విడుదల. 16 వార్డుల్లో టీడీపీ 12, జనసేన 1, వైసీపీ 3 చోట్ల విజయం. 13 వార్డులతో కూటమి దూకుడు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 3 Nov 2026 1:18 PM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తొలి రౌండ్‌లో కూటమి ఘనవిజయం!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 32 వార్డులకు గాను మొదటి రౌండ్‌లో 16 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 12 వార్డుల్లో, జనసేన పార్టీ 1 వార్డులో, వైఎస్సార్‌సీపీ 3 వార్డుల్లో విజయం సాధించాయి. దీంతో తొలి రౌండ్ ఫలితాల్లో కూటమి 13 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన 16 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. తొలి రౌండ్‌లో వెలువడిన ఫలితాల ప్రకారం 1వ వార్డులో టీడీపీ అభ్యర్థి కృష్ణమోహన్ 561 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి ఎల్లా అశోక్‌పై 160 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి హనుమంతరాయుడు 551 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి రామాంజనేయులుపై 155 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

3వ వార్డులో వైసీపీ అభ్యర్థి త్రివేణి 501 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి ఆనందప్పగారి అన్నపూర్ణపై 80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4వ వార్డులో వైసీపీ అభ్యర్థికి 473 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి సత్యనారాయణకు 387 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి 86 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకటలక్ష్మి 815 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి మరెక్కపై 574 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి శైలజ 730 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి లక్ష్మమ్మపై 413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి పి. వాణి 542 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి వడ్డే నీలమ్మపై 358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

8వ వార్డులో టీడీపీ అభ్యర్థి సునీత 673 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి గణేష్‌పై 447 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 9వ వార్డులో జనసేన అభ్యర్థి అమృత 475 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి తిరుపతమ్మపై 238 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ 330 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి బి. మహేష్‌పై 199 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

11వ వార్డులో టీడీపీ అభ్యర్థి తిమోజమ్మ 593 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి తస్లీమ్ బేగంపై 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి పి. రేవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి హసీనా 639 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి జ్యోతిపై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

14వ వార్డులో వైసీపీ అభ్యర్థి అజయ్ 346 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులుపై 55 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి పూజారి నాగమణి 505 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి రచనపై 162 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 16వ వార్డులో టీడీపీ అభ్యర్థి త్రివేణి 551 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి తేజస్వినిపై 232 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తొలి రౌండ్‌లో 16 వార్డుల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం టీడీపీ 12, జనసేన 1, వైసీపీ 3 వార్డుల్లో విజయం సాధించాయి. మిగిలిన 16 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మున్సిపాలిటీలో మొత్తం ఫలితాలపై స్పష్టత రానుంది.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam