Kalyandurgam: 53 రోజుల జైలు జీవితానికి గుర్తుగా 53 కొవ్వొత్తులతో నిరసన!
Kalyandurgam: చంద్రబాబు అరెస్ట్‌కు ఏడాదైన సందర్భంగా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ.
Kalyandurgam: 53 రోజుల జైలు జీవితానికి గుర్తుగా 53 కొవ్వొత్తులతో నిరసన!
Kalyandurgam: చంద్రబాబు నాయుడు అరెస్టై నేటికి మూడేళ్లు. 1,096 రోజులు పూర్తయ్యాయి. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో జరిగిన చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుంటూ కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు 53 కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ భవన్ వరకు సాగింది.
చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 53 రోజులు జైలు జీవితం గడిపారని, ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు, కంటి చికిత్స అవసరం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు.
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 31న జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరిన సమయంలో దారిపొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారని పేర్కొన్నారు. సుమారు 13 గంటల ప్రయాణం అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత బాధాకరమైన ఘటన అని అన్నారు.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిని జైలుకు పంపడం దారుణమని వ్యాఖ్యానించారు.. అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం విషయంలో కూడా ఆందోళన నెలకొందని, చివరకు న్యాయపోరాటం ద్వారా బెయిల్ లభించిందని పేర్కొన్నారు.. మూడేళ్లు గడిచినా ఆ అరెస్టు ఘటనను తాము మరచిపోలేదని, 53 రోజుల జైలు జీవితానికి గుర్తుగా 53 కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే భావనతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని, ఆయన నాయకత్వంలో ప్రజల కోసం మరింత ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




