Kadiri: ఆధ్యాత్మిక కేంద్రంగా కదిరి.. గిరి ప్రదక్షిణకు త్వరలో మోక్షం!

Kadiri: కదిరి కొండ (స్తోత్రాద్రి) చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు సేవా సమితి విన్నవించింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 April 2026 8:42 PM IST
Kadiri
X

Kadiri: ఆధ్యాత్మిక కేంద్రంగా కదిరి.. గిరి ప్రదక్షిణకు త్వరలో మోక్షం!

Kadiri: శ్రీ సత్యసాయి కదిరి నియోజక వర్గాన్ని ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలనే మీ సంకల్పం అభినందనీయం. అందులో భాగంగానే శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమరాయుడుగా, కొండల లక్ష్మీ నారసింహుడుగా కదిరి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో (స్తోత్రాద్రి ) కదిరి కొండపై మొదటగా "పాదం" మోపారని ఖాద్రీపురాణంలో పేర్కొనబడింది.

ఇటువంటి పవిత్రమైన ప్రదేశం స్తోత్రాద్రికి 15 నెలలుగా శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతినెల పెద్దయెత్తున శ్రీ వారి భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో సరైన రోడ్డు లేకపోవడం వల్ల మహిళలు, పిల్లలు , వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మీరు శ్రీ వారి గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్నటువంటి భక్తాదులకు కదిరి కొండ చుట్టూ రోడ్డు నిర్మిస్తామని తెలపడం,

మూడు సంవత్సరాల అనంతరం "ప్రహ్లాద సమేత శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనం" పునఃప్రారంభించడం నిజంగా ప్రతి భక్తునికి సంతోషాన్ని కలిగించింది. కావున మీరు సహృదయంతో సాధ్యం అయినంత తొందరగా కదిరికొండ చుట్టూ రోడ్డు పనులు ప్రారంభించాలని, శ్రీ వారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం సాయంత్రం పూట ఒక గంట పాటు పొడిగించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున వివతి పత్రం అందించడం జరిగింది.

శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు స్పందిస్తూ అతి తొందరలో శ్రీ వారి భక్తుల సౌకర్యార్థం స్తోత్రాద్రి ( కదిరి కొండ ) చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి నిర్మాణ పనులు చేస్తామని, శ్రీ వారి భక్తులకు సాయంత్రం వేళల్లో కూడా ప్రహ్లాద సమేత శ్రీ వారి అంతరాలయ దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story