Kasapuram: కసాపురంలో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు: స్వామివారికి ఘనంగా ‘లక్ష సింధూరార్చన’
Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
కసాపురం (గుంతకల్లు): శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం గ్రా, గుంతకల్లు మం , అనంతపురము జిల్లా. హనుమజ్జయంతి మహోత్సవములు 2026. 11.05.2026 సోమవారము రెండవ రోజు వైశాఖ బహుళ నవమి ఉదయం 8-05 నిమిషాల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన , గోపూజ, సుందరకాండ మన్యుసూక్త పారాయణ హోమము , శ్రీరామ ఆంజనేయ మూల మంత్ర అనుష్టానం మరియు సాయంత్రం 5-00 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి లక్ష సింధూరార్చన కార్యక్రమము నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె.సుగుణమ్మ గారు , ప్రధాన ఆర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు , వేద పండితులు , అర్చకులు , భక్తులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story




