Dharmavaram: రేపు ధర్మవరం రోడ్లపైకి కేతిరెడ్డి.. పెట్రోల్, డీజిల్ ధరలపై రేపే భారీ ఫైట్!
Dharmavaram: సత్యసాయి జిల్లా ధర్మవరంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రేపు భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.
Dharmavaram: రేపు ధర్మవరం రోడ్లపైకి కేతిరెడ్డి.. పెట్రోల్, డీజిల్ ధరలపై రేపే భారీ ఫైట్!
సత్యసాయి జిల్లా ధర్మవరం: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రేపు భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించి కేతిరెడ్డి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ధర్మవరం లోని కేతిరెడ్డి కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన చేపడతారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తారు.ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు.




