Dharmavaram: పవన్ కు పర్యవేక్షణ లోపించింది.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Dharmavaram: ధర్మవరం నియోజకవర్గ ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ, హార్టికల్చర్ శాఖల్లో ₹1.38 కోట్ల అవినీతి జరిగిందని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 20 April 2026 8:30 PM IST
Dharmavaram
X

Dharmavaram: పవన్ కు పర్యవేక్షణ లోపించింది.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయ కర్త కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ని కలిశారు.

ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం పరిధిలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం (MGNREGS) మరియు హార్టికల్చర్ శాఖలో జరుగుతున్న పనులలో పలు అక్రమాలు,అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1 కోటి 38 లక్షల వరకు అవినీతి జరిగినట్లు కేతిరెడ్డి కలెక్టర్ కు తెలిపారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి తెలిపిన విషయాలు:

ఉపాధి హామీ పథకంలో కార్మికులకు సరైన పనులు ఇవ్వకపోవడం.

పనులు జరిగినట్లుగా చూపిస్తూ నిధుల దుర్వినియోగం.

హార్టికల్చర్ పథకాల అమలులో పారదర్శకత లేకపోవడం, ఉద్యోగులు తమ బంధువుల పేరుతో బోర్లు లేనిచోట కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో టమోటా సాగు చేసినట్లు చూపిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని వీరి వెనుక సూత్రధారులు ఎవరున్నారో బయట పెట్టాలన్నారు.

ఈ అవినీతిలో మంత్రి సత్య కుమార్ కు సంబంధం లేకపోతే అవినీతికి పాల్పడ్డ అధికారులపై విచారణ వేగవంతం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి సూచించారు. సొంత డిపార్ట్మెంట్ ఐన ఉపాధి హామీ పై పవన్ కళ్యాణ్ కు పర్యవేక్షణ లోపించిందన్నారు.గ్రౌండ్ స్థాయిలో జరిగే అవినీతిని పట్టించుకోక చంద్రబాబు ఏది చెప్తే దానికి తల ఊపుతున్నంతకాలం అవినీతి మరక పవన్ కళ్యాణ్ కు కూడా అంటుకుంటుందన్నారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story