Kothacheruvu: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పూల శివప్రసాద్ పిలుపు!

Kothacheruvu: కొత్తచెరువులో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అవగాహన.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 13 Sept 2026 1:18 PM IST
Kothacheruvu
X

Kothacheruvu: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పూల శివప్రసాద్ పిలుపు!

Kothacheruvu: కొత్తచెరువులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వినియోగించాలని జనసేన నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ వినాయక చవితిని పురస్కరించుకుని కొత్తచెరువులో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పూల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు.

ప్రజలంతా రసాయన రహిత మట్టి వినాయక విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL