Fire Accident: అనంతపురం జిల్లాలో హైవేపై తగలబడిన లారీ
Fire Accident: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై (NH-44) ఘోర ప్రమాదం జరిగింది.
Fire Accident: అనంతపురం జిల్లాలో హైవేపై తగలబడిన లారీ
Fire Accident: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి.. లారీ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో డ్రైవర్ రషీద్ స్వల్పంగా గాయపడ్డాడు. హైదరాబాదు నుండి బెంగళూరుకు బ్రీజర్ ఖాళీ బాటిల్ తరలిస్తుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Next Story




