Kalyandurgam: ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఘన నివాళి!

Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు వేడుకలు వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

P.Sudhakar, Anantapuram
Published on: 27 May 2026 12:52 PM IST
Kalyandurgam
X

Kalyandurgam: ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఘన నివాళి!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు వేడుకలు వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సిరి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభ ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, పార్టీ నినాదాలతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ వేడుక అని, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణకు ఇది ముఖ్య వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంధనపొదుపు, సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం అభినందనీయమన్నారు.

వర్చువల్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల ప్రసంగాలను కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వీక్షించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కృషి చేస్తోందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మరింతబలోపేతం అవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. వర్చువల్ మహానాడులో పాల్గొన్న కార్యకర్తలు పార్టీ నినాదాలతో ఉత్సాహంగా సందడి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story