Anantapur: అనంతపురంలో హనీట్రాప్ ముఠా అరెస్ట్.. కోటి 20 లక్షలు వసూలు!
Anantapur: అనంతపురంలో కలకలం రేపిన హనీట్రాప్ ముఠా గుట్టు రట్టు. ఐదుగురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. 20 మందిని బెదిరించి రూ. కోటి 20 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడి.
Anantapur: అనంతపురంలో హనీట్రాప్ ముఠా అరెస్ట్.. కోటి 20 లక్షలు వసూలు!
Anantapur: రాష్ట్రంలో సంచలనం రేపిన హానీ ట్రాప్ కేసులో 5మంది అరెస్ట్ అయ్యారు. సమాజంలో డబ్బున్న కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకుని.. అమ్మాయిల ద్వారా ట్రాప్ లోకి లాగి లక్షల రూపాయల వసూళ్లు చేస్తున్న ముఠా గుట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై సిరియస్ గా వ్యవహరించిన జిల్లా ఎస్పీ డీఎస్పీ ద్వారా విచారణకు ఆదేశించారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉదయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపట్టగా.. మొత్తం ముఠా చేస్తున్న ఇల్లీగల్ పనులు వెలుగులోకి వచ్చాయి.
ఈ హానీ ట్రాప్ లో కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్న రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటు బాధితులను బెదిరిస్తున్న దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారి అనే మహిళల్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 20మందిని బెదిరించి కోటి 20లక్షల వరకు వసూళ్లు చేసినట్టు తేలిందన్నారు. వారి వద్ద నుంచి 13లక్షల నగదు, రెండు కత్తులు, ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 8మంది ఉన్నారని.. వారి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో పాటు కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులకున్న సంబంధాల పై డీఎస్పీ సమాధానం దాటవేశారు. దీనిపై విచారణ జరుగుతోందని ఆయన సమాధానం ఇచ్చారు.




