Kadiri: కదిరి రూరల్ వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు
Kadiri: కదిరి రూరల్ మండలం బూరుగుపల్లికి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
Kadiri: కదిరి రూరల్ వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం బూరుగుపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 50 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ సర్పంచ్ బి. సాయి కుమార్, గ్రామ అధ్యక్షులు జి. ఆంజనేయులు, సీనియర్ నాయకులు పి. శ్రీనివాసులు, కె. భాస్కర, జి. శ్రీనివాసులు, గంధం శివ, జి. భాస్కర్ తదితరుల ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




