Anantapur: మహిళల రక్షణకు అండగా.. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే, ఎస్పీల భారీ ర్యాలీ

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా మహిళా భద్రత అవగాహన బైక్ ర్యాలీ.

P.Sudhakar, Anantapuram
Published on: 23 April 2026 3:42 PM IST
Anantapur
X

Anantapur: మహిళల రక్షణకు అండగా.. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే, ఎస్పీల భారీ ర్యాలీ

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళల భద్రతపై అవగాహన పెంచేందుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పద్మావతి గోవిందరాజులు కళ్యాణమంటపం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, జిల్లా ఎస్పీ పీ జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీకి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తున్నారని తెలిపారు. మహిళలు ఎక్కడైనా నిర్భయంగా తిరిగే స్వేచ్ఛ కలిగి ఉండాలని, వారికి సమాజం పూర్తి భరోసా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మహిళలపై గౌరవాన్ని పెంపొందించడం ద్వారా సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు.జిల్లా ఎస్పీ పీ జగదీష్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు స్త్రీ శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందగానే వేగంగా స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మహిళలు, బాలికలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరమని, సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని ఇద్దరూ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలను నివారించి, బాలికలకు ఉన్నత విద్య అందించేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న హెల్ప్‌లైన్‌లు, భద్రతా యాప్‌లను ఉపయోగించడం ద్వారా మహిళలు తమ భద్రతను మరింత బలోపేతం చేసుకోవచ్చని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.ఈ ర్యాలీలో పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story