Kadiri: కదిరి నరసింహ స్వామి కోనేరులో కోట్లాది రూపాయల దందా: భగ్గుమన్న ప్రతిపక్ష నేతలు!

Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు పనుల్లో రూ. 6 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ.

P.RAHAMTULLA, KADIRI
Published on: 11 Jun 2026 11:17 AM IST
Kadiri
X

Kadiri: కదిరి నరసింహ స్వామి కోనేరులో కోట్లాది రూపాయల దందా: భగ్గుమన్న ప్రతిపక్ష నేతలు!

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామివారి కోనేరు నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. జనసేన నేత బైరవ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేంద్ర ప్రసాద్ సోమ్లా నాయక్ లతో కలిసి బుధవారం లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు ను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనేరు రిపేర్ల పేరుతో రెండు దశల్లో దాదాపు రూ. 6 కోట్ల బిల్లులు దోచేశారని ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి గత 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని 6 సంవత్సరాలుగా చేస్తున్నారని మండిపడ్డారు. గుడిలో అదనపు నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలను నామినేషన్ పేరుతో నిత్యం దోపిడీ చేస్తూ తప్పుడు బిల్లులు తో నిధులు దుర్వినియోగం చేశారన్నారు.

6 సంవత్సరాలుగా కోనేరు పనులు పూర్తి చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భక్తుల కానుకల రూపంలో వచ్చిన కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆలయం చుట్టూ దేవుడి ఆస్తులు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీని కారణంగా ఈ మధ్య వచ్చిన వర్షం నీరు ప్రధాన ఆలయం లోకి చేరుతోందన్నారు.

దేవుడి నైవేద్యం, ప్రసాదం పంపిణీ విషయంలో కూడా ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story