Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం నారా లోకేష్ దిశానిర్దేశం

Nara Lokesh: అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 14 May 2026 9:20 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం నారా లోకేష్ దిశానిర్దేశం

Nara Lokesh: టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురంలో కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి, అస్మిత్ రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు తో పాటు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నారా లోకేష్ జై చంద్రబాబు జై అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలలో మంత్రి నారా లోకేష్ సన్మానించి, అవార్డులు అందించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పదవులు రాలేదని, ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వర్గ పోరు ఉందని ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రతి కార్యకర్త అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ప్రతి కార్యకర్తతో మంత్రి నారా లోకేష్ సెల్ఫీ దిగారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story