Hindupur: సాగు, తాగునీటి కల సాకారం.. ఎమ్మెల్యే బాలకృష్ణ హర్షం!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా రాచపల్లి వద్ద రూ. 750 కోట్లతో హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేశారు.
Hindupur: సాగు, తాగునీటి కల సాకారం.. ఎమ్మెల్యే బాలకృష్ణ హర్షం!
హిందూపూర్: సాగునీటి కలను సాకారం చేసే మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న హంద్రీ నీవాకాలువ వెడల్పు పనులను మంత్రి నిమ్మలనాయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూజలు గావించి పనులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిటాచి వాహనం ఎక్కి పనులు ప్రారంభించిన సన్నివేశం ఆకట్టుకున్నాయి. సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమను రతనాలసీమ గా మార్చాలన్న ఎన్టీరామారావు సంకల్పమని ఆయన పాలనలో తుంగభద్ర గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తిచేసి రాగనీరు సాగనీరు కల్పించడం జరిగిందని తెలిపారు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగానే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగిందని అందులో భాగంగానే అందులో భాగంగానే నీటి ప్రాజెక్టుల కోసం అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.
రాయలసీమ రైతులతో పాటు ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో హంద్రీనీవా ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్య త ఇవ్వడం జరుగుతుందన్నారు. గత వైసిపి పాలనలో అభివృద్ధి ఏమాత్రం లేదని అందులో నీటి ప్రాజెక్టు ఉరువే లేదన్నారు. అదే కూటమి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగిందని ఇందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు సంబంధిత మంత్రులంతా ఎంతగానో సహకరిస్తున్నారు.
వ్యవసాయం నుంచి ప్రజా సౌకర్యాల వరకు సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో ఇక సాగునీరుకు అటు తాగునీరుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.




