Anantapur: అనంతపురం కార్పొరేషన్ సమరం: కూటమి కీలక సమన్వయ సమావేశం!

Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలపై కూటమి ఫోకస్. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ప్రసాద్ ఆధ్వర్యంలో 62 వార్డుల అభ్యర్థులతో సమన్వయ సమావేశం జరిగింది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 22 Oct 2026 1:32 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం కార్పొరేషన్ సమరం: కూటమి కీలక సమన్వయ సమావేశం!

Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల సమరానికి కూటమి పార్టీలు పకడ్బందీ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అర్బన్ టీడీపీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. 62 వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో నగరాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.డంపింగ్ యార్డులో ఇప్పటికే 75 శాతం చెత్తను తొలగించామని తెలిపారు. నగరంలో త్వరలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానికంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటేనే నిధులు సమకూర్చుకుని నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు.వైసీపీకి ఓటు వేస్తే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలోనే సుమారు 1,300 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

మరోవైపు 300 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.నగరంలో అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలంటే కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఇక మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీకి ఓటు వేస్తే అనంతపురం నగరం మళ్లీ వెనుకబడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.మొత్తంగా అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM