Dharmavaram: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సైకిల్ ర్యాలీ

Dharmavaram: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, మొక్కలు నాటారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 5 Jun 2026 8:55 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సైకిల్ ర్యాలీ

Dharmavaram: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ధర్మవరం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మొక్కలు నాటారు. పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం నుండి సైకిళ్లపై ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకొని నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు తల్లి పేరుతో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.

ప్రస్తుత సమయంలో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ సంక్షోభం,ఎల్ నినో లాంటి ఉపద్రవాల నుండి మానవాళిని కాపాడుకోవాలంటే అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఇదే సందర్భంలో DSC పరీక్షల రిజల్ట్స్ పై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు వైకాపా నాయకుల ఆరోపణలు చేస్తున్నారన్నారు.

డీఎస్సీ రిజల్ట్స్ పై ఆ శాక ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్తి వివరణ ఇచ్చినా కూడా వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నాడు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి 16 వేల డి ఎస్సీ ఉద్యోగులను తొలగిస్తానండటం చూస్తుంటే గతంలో ఎలా చేశాడో ఇప్పుడు అదే విధంగా చేస్తానంటున్నాడని బురద చల్లి కడుక్కోమనడం జగన్మోహన్ రెడ్డి నైజం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story